‘పుష్ప’ లో విలన్.. క్లారిటీ ఇచ్చిన మాధవన్..?

-

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్యాలిక్యులేటెడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయన్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని టాక్ వినిపిస్తుండగా ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది.

అయితే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ను ఢీ కొట్టే విలన్ పాత్రలో తమిళ నటుడు విజయ్ సేతుపతిని తీసుకున్నారని.. మొదట టాక్ వచ్చింది. ఆ తర్వాత మరో నటుడు మాధవన్ ను ఫైనల్ చేశారు అంటూ టాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు మాధవన్. తాను పుష్ప సినిమాలో నటించడం లేదని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అన్ని అవాస్తవం అంటూ తెలిపారు. దీంతో పుష్ప సినిమాలో విలన్ గా నటించబోయేది ఎవరు అన్న చర్చ మరోసారి ఊపందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news