తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అమలులోకి రానున్న పలు సంక్షేమ పథకాలపై రేపు సీఎల్పీ సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుండగా.. కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం హాజరుకానున్నారు.
శంషాబాద్‌లోని నోవాటెల్‌లో ఉదయం 11 గంటలకు సీఎం అధ్యక్షతన ఈ సీఎల్పీ సమావేశం ప్రారంభంకానుంది. ఇందులో నాలుగు అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. భూ భారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ-ఎస్టీ వర్గీకరణపై చర్చ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వ విప్‌లు సమాచారమిచ్చారు.