కర్ణాటక ఎన్నికల ఫలితాలలో స్పష్టమైన మెజారిటీని కాంగ్రెస్ అందుకోవడంతో ఇక బీజేపీ పని ముగిసిపోయింది. సరిగ్గా సర్వేలు చెప్పిన విధంగానే కాంగ్రెస్ ఈ ఎన్నికలలో జైత్రయాత్ర కొనసాగించింది. కాగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయడానికి ప్రణాళికలు చేస్తోంది. మొదటగా సీఎం ను ప్రకటించి ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణనను చేపట దిశగా కాంగ్రెస్ హై కమాండ్ నుండి సూచనలు అందుతున్నాయి. కాగా ఈ రోజు సాయంత్రం పూర్తి ఫలితాలు వచ్చి.. విజయాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించిన అనంతరం సీఎం బసవరాజ్ బొమ్మై రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.
స్వయంగా బొమ్మై కర్ణాటక గవర్నర్ తవార్ చంద్ గెహ్లాట్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బొమ్మై ప్రజలు మార్పును ఆశిస్తున్నారని ఓటమిని అంగీకరించారు.