Breaking : రేపటి నుంచి సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్

-

తెలంగాణ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక మెనూ అమలు చేయనున్నారు. ఈ పథకం పేరు సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్. రేపటి (అక్టోబరు 6) నుంచి దీన్ని అమలు చేయనున్నారు. ఆరోగ్యంగా ఉంటేనే విద్యార్థులు చదువుపై దృష్టి సారించగలరని, ముఖ్యంగా నిరుపేద విద్యార్థులకు పౌష్టికాహారం అందాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ను విజయదశమి నుంచి అమలు చేద్దామని నిర్ణయించినా, ఒకవేళ ఎన్నికల కోడ్ ముందే వస్తే, ఈ స్కీమ్ ప్రకటించడానికి నియమావళి ఒప్పుకోదని తెలంగాణ ప్రభుత్వం పునరాలోచనలో పడింది.

Telangana to introduce breakfast scheme for school students

ఇక ఈ మెనూ విషయానికి వస్తే సోమవారం నాడు ఇడ్లీ సాంబార్ లేదా చట్నీతో గోధుమ రవ్వ ఉప్మా పెట్టనున్నారు. మంగళవారం నాడు పూరి ఆలు కుర్మా లేదా చట్నీతో రవ్వ టమాటా బాత్ పెట్టనున్నారు. బుధవారం నాడు ఉప్మా, సాంబార్, లేదా కిచిడి, చట్నీ పెట్టనున్నారు. గురువారం నాడు మిల్లెట్ ఇడ్లీ సాంబార్ లేదా పొంగల్ సాంబార్ పెట్టనున్నారు. శుక్రవారం నాడు ఉగ్గాని లేదా పోహా లేదా మిల్లెట్ ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడి, చట్నీ పెట్టనున్నారు. శనివారంనాడు పొంగల్, సాంబార్ లేదా వెజిటబుల్ పలావ్, ఆలూ కుర్మా, రైతా పెట్టనున్నారు. ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని పాఠశాలలో పాఠశాల ప్రారంభ సమయం కంటే ముప్పావు గంట ముందు అందించనున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news