బీఆర్ఎస్ కు రేఖా నాయక్ గుడ్ బై.. కాంగ్రెస్ కు బైబై.. పోటీకీ సై..!

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో  తీవ్ర అసంతృప్తితో పార్టీ మారేందుకు సిద్దమైనట్లు ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో వెంటనే ఆమె బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ నుండి కూడా స్పష్టమైన హామీ రాకపోవడంతో ఇన్నిరోజులు ఏ నిర్ణయమూ తీసుకోకుండా వేచిచూసారు. కానీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో తాజాగా రేఖా నాయక్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

బిఆర్ఎస్ పార్టీకీ రేపు రాజీనామా చేయనున్నట్లు రేఖా నాయక్ తెలిపారు. తాను ఏ పార్టీలో చేరడంలేదని.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఖానాపూర్ ప్రజలకు సేవ చేయడానికే మళ్ళీ పోటీ చేస్తున్నానని.. వాళ్లే తనను గెలిపించుకుంటారని రేఖా నాయక్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరతారనుకుంటే ఇలా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ రేఖా నాయక్ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో పలుమార్లు సంప్రదింపులు జరిపినా స్పష్టమైన హామీ రాకపోవడంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news