కన్నీటిపర్యంతమైన సీఎం చంద్రబాబు

-

నందమూరి హరికృష్ణ భౌతికకాయాన్ని చూసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కన్నీటి పర్యాంతమయ్యారు. మంత్రి లోకేశ్ హరికృష్ణను చూస్తూ ..మామ మమ్మల్ని విడిచి వెళ్లిపోయావా అంటూ దు:ఖంలో మునిగిపోయారు. ప్రమాద వార్త తెలియగానే ప్రత్యేక హెలికాఫ్టర్ లో నల్గొండకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నార్కెట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే ఆసుపత్రికి చేరుకున్న హరికృష్ణ కుటుంబ సభ్యులు జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లతో పాటు బాలకృష్ణ, పురందరేశ్వరీ, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావులను చూసి ఒకే సారి కుటుంబ సభ్యులందరు కన్నీటిపర్యంతమయ్యారు.. ఈ సన్నివేశాన్ని చూసిన ప్రతిఒక్కరికి కళ్లు చెమర్చాయి.

రోడు మార్గంలో భౌతికకాయం తరలింపు…

కామినేని ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తైన అనంతరం . అంబులెన్స్ లో.. హరికృష్ణ పార్థీవదేహం తో ఆయన సోదరుడు రామకృష్ణ ఉన్నారు..  అంబులెన్స్ తో పాటు రోడ్డు  మార్గంలోనే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నాయుడు, బాలకృష్ణ.. హైదరాబాద్ కి బయలుదేరారు. అంబులెన్స్ ముందు కారులో  జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వెళ్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news