పోలవరంపై కీలక నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు

-

ఏపీ సీఎంగా నాలుగవసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు పాలనాపరంగా తన మార్క్ వేసే దిశగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే పలు శాఖలకు సంబంధించిన అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ పోలవరం, అమరావతిపై ప్రత్యేక చంద్రబాబు దృష్టి పెట్టారు.

ఇటీవలే పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.అంతర్జాతీయ నిపుణులతో పోలవరం ప్రజెక్టుపై పరిశీలన జరపాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.నేడు ఢిల్లీకి చేరుకున్న అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టును 4 రోజుల పాటు పరిశీలించనుంది. ప్రాజెక్టులో ఏర్పడ్డ సాంకేతిక సవాళ్ళను పరిష్కరించేందుకు ఈ బృందాన్ని రంగంలోకి దించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పర్యటనలో అంతర్జీతీయ నిపుణులతో పాటు ప్రాజెక్టు అథారిటీ ముఖ్యులు,సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ ప్రతినిధులు, కేంద్ర జలసంఘం నిపుణులు, మేఘా వంటి కంపెనీల ప్రతినిధులు, అంతర్జాతీయ డిజైన్‌ సంస్థ అఫ్రి ప్రతినిధులు పోలవరాన్ని సందర్శించనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news