పీవీ సింధుకి రూ. 5 లక్షల చెక్‌ అందజేసిన సీఎం జగన్

-

జూలై 23 నుంచి జపాన్‌ దేశంలోని టోక్యో నగరంలో ఒలింపిక్స్‌ ప్రారంభంకానున్న విషయం తెల్సిందే. ఆగష్టు 8 వరకు ఈ ఒలింపిక్స్‌ జరగనున్నాయి. కాగా ఈ సారి జరిగే ఒలింపిక్స్‌లో తెలుగు తేజం, బ్యాడ్మింటన్ సూపర్‌ స్టార్ పీవీ సింధు పాల్గొననున్న విషయం తెల్సిందే. సింధుతో పాటు ఏపీ నుంచి ఆర్‌. సాత్విక్‌ సాయిరాజ్ (బ్యాడ్మింటన్ ), రజనీ (ఉమెన్స్‌ హకీ)లు పాల్గొననున్నారు.

పీవీ సింధు/pvsindhu
పీవీ సింధు/pvsindhu

కాగా ఒలింపిక్స్‌లో పాల్గొననున్న ముగ్గురు తెలుగు క్రీడాకారులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. అలానే ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చెక్‌ అందజేసారు.చిత్తూరు జిల్లాకు చెందిన హకీ క్రీడాకారిణి రజనీ బెంగళూరులో శిక్షణలో ఉన్న కారణంగా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. రజనీ తరపున ఆమె కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం వారి కుటుంబ సభ్యులకు చెక్‌ అందజేసారు.

అలానే విశాఖలో బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జీవోను సీఎం జగన్ పీవీ సింధుకి అందజేసారు. కాగా 2016 రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు రజతం అందుకున్న విషయం తెల్సిందే. స్పెయిన్ బ్యాడ్మింటన్ స్టార్ కరోలినా మారిన్‌ చేతిలో ఓడిన సింధు తృటిలో గోల్డ్ మిస్ చేసుకుంది. అయితే ఈసారి మాత్రం గోల్డ్ సాధించాలని పట్టుదలతో ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news