వైద్య ఆరోగ్యశాఖలో 14,200 పోస్టుల భర్తీకి సిఎం జగన్ గ్రీన్‌ సిగ్నల్‌

-

వైద్య ఆరోగ్యశాఖపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సిఎం జగన్. సిబ్బంది కొరత లేని ప్రభుత్వాసుపత్రిలలో పటిష్ట చర్యలకు జగన్ నాంది పలికారు. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న సుమారు 14,200 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఈ సందర్భంగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వైద్యకళాశాల, బోధనాసుపత్రుల వరకూ అన్నీ ఖాళీలను భర్తీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అక్టోబరు నుంచి ప్రక్రియ ప్రారంభించి.. నవంబర్‌ 15 వ తేదీ నాటికి ముగించాలని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత ఉండకూడదని స్పష్టం చేశారు సీఎం జగన్. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఆస్పత్రులను నిర్మిస్తున్నామని.. తీరా అక్కడ చూస్తే.. సిబ్బంది లేక రోగులకు సేవలు అందని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం జగన్.

సంవత్సరాల తరబడి ఇలాంటి సమస్యలే మనం నిత్యం చూస్తున్నామని.. ఇకపై దీనికి చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యం కోసం భారీగా ఖర్చులు చేయాల్సిన పరిస్థితి పోవాలని.. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందాలని పేర్కొన్నారు సిఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news