ఏపీ స‌చివాల‌య ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్..!

ఏపీలో స‌చివాల‌య ఉద్యోగుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. హెచ్ వో డీ కార్యాల‌యాల్లోని ఉద్యోగుల‌కు ఉచిత గృహ‌వ‌స‌తి సౌక‌ర్యం పొడిగించేందుకు సీఎం జ‌గ‌న్ ఆమోదం తెలిపినట్టు స‌చివాల‌య ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు వెంక‌ట్రామిరెడ్డి తెలిపారు. హైద‌రాబాద్ నుండి పూర్తిగా త‌ర‌లిరాని ఉద్యోగుల కోసం ఉచిత వ‌స‌తిని 2022 ఎప్రిల్ వ‌ర‌కూ ఆరునెల‌ల పాటు పొడిగించాల‌ని సీఎం ఆదేశించిన‌ట్టు వెల్ల‌డించారు.

jagan
jagan

ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి అధికారిక కార్యాల‌యం సంబంధిత ఉద్యోగులు స‌మాచారం పంపిన‌ట్టు పేర్కొన్నారు. ఈనెలాఖ‌రుతో ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ఉచిత వ‌స‌తి గ‌డువు ముగుస్తుండ‌టంతో ప్ర‌భుత్వం ఉద్యోగుల ఫెడ‌రేష‌న్ విజ్ఞ‌ప్తి మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని వెల్ల‌డించారు. ఇక సీఎం జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్న‌యం తో స‌చివాల‌య ఉద్యోగులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.