ఏపీ విద్యార్థులకు జగన్ శుభవార్త : విద్యా కానుకలో మరిన్ని వస్తువులు

వచ్చే ఏడాది నుంచి విద్యా కానుకలో భాగంగా స్పోర్ట్స్‌ షూ, స్పోర్ట్స్‌ డ్రస్‌ అదనంగా ఇస్తామని సీఎం వైయస్‌. జగన్‌ ప్రకటన చేశారు. విద్యాశాఖ లో నాడు–నేడు, పౌండేషన్‌ స్కూళ్లు పై సీఎం వైయస్‌. జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ నూతన విద్యావిధానం అమలు పై అన్ని రకాలుగా సిద్ధంకావాలని.. పాఠ్యపుస్తకాల ముద్రణ నాణ్యతను పెంచాలని తెలిపారు.

Jagan

కనీసం మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని.. స్కూళ్ల, టాయిలెట్ల నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద చూపించాలన్నారు సీఎం జగన్. ఏదైనా సమస్య వస్తే వెంటనే చేయించడానికి కంటిజెన్సీ ఫండ్‌ ప్రతి స్కూల్లో ఉంచాలని.. దీనిపై ఎస్‌ఓపీలను తయారు చేయాలని ఆదేశించారు. విద్యాకానుక కింద ఇచ్చే వస్తువులు నాణ్యంగా ఉండాలని.. అక్టోబరులో స్కూళ్లలో స్వేచ్ఛ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. స్కూల్లో ఆడపిల్లలకు శానిటరీ నాప్‌కిన్స్‌ పంపిణీ చేస్తామని వివరించారు సీఎం వైయస్‌. జగన్‌ .