ఏపీ పేదలకు జగన్‌ తీపికబురు..డిసెంబర్‌ లో 5 లక్షల ఇండ్లు

-

ఏపీ పేదలకు సీఎం జగన్‌ తీపికబురు చెప్పారు. డిసెంబర్‌ లో 5 లక్షల ఇండ్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో గడప గడపకూ మన ప్రభుత్వం నిర్వహించిన నెల రోజుల్లో ప్రాధాన్యతా పనులు మొదలు కావాలని ఆదేశించిన సీఎం జగన్.. అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించారు.

cm jagan
cm jagan

ఉపాధి హామీ పథకం కింద కనీసం వేతనం రూ.240 లు అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. డిసెంబర్‌ 25 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం జగన్‌.. జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా అర్హులైన లబ్ధిదారులకు ఫేజ్‌ –3 కింద డిసెంబర్లో ఇళ్ల మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఎస్‌డీజీ లక్ష్యాల సాధన ఆధారంగా కలెక్టర్లకు మార్కులు ఉండాలని.. ఎస్‌డీజీ లక్ష్యాలే కలెక్టర్ల పని తీరుకు ప్రమాణంసీఎం వెల్లడించారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news