ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాలనలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమ పథకాలను పుష్కలంగా అందిస్తూ ప్రజల్లో మంచి పేరును సార్ధకం చేసుకుంటున్నాడు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం పల్నాడు జిల్లా ప్రజలకు శుభవార్తను అందించాడు. ఈ జిల్లాలో రూ. 320 .26 కోట్ల వ్యయంతో వరికపుడిశల ఎత్తిపోతల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ నిర్మాణానికి రేపు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా మొదటి దశలో 24900 ఎకరాలకు సాగు నీరును అందించడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పనిచేయనుంది. వాస్తవంగా ఇక్కడ ఎత్తిపోతల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో 6 దశాబ్దాలుగా కాగితాలకే వరికపుడిశెల పరిమితం అయింది.
ఈ నీళ్లతో పాటు గోదావరి జలాలను కలిపి పల్నాడును శుభిక్షము చేసేందు సీఎం జగన్ ప్రణాలికలు రచిస్తున్నారు. అయితే సీఎం జగన్ చేసిన కృషి వలనే టైగర్ ఫారెస్ట్ లో పనులను చేయడానికి కేంద్ర అటవీ శాఖ అనుమతులు ఇచ్చింది.