సీఎం జగన్ ‘వైఎస్‌ఆర్‌ జలకళ’ కు శ్రీకారం

సన్న కారు రైతులైతే ప్రతి ఒక్కరూ నీళ్ల కోసం భగీరథ ప్రయత్నమే చేయాలి. ధైర్యం చేసి బోరు వేపిస్తే నీరు పడతాయో లేదో అన్న సందేహం. నీళ్లు పడితే పర్వాలేదు. పడకపోతే వచ్చే నష్టాన్ని భర్తీ చేసేందుకు మళ్లీ నాలుగైదేళ్లు రెక్కల కష్టం చేయాలి. అందుకే అధిక శాతం మంది సన్న, చిన్నకారు రైతులు తమ పొలాల్లో బోరు వేపించాలని ఉన్నా ఆ సాహసం చేయరు.. ఇలాంటి వారి కోసమే ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఆ పథకమే వైఎస్సార్ జళకళ.

ఇచ్చిన హామీ మేరకు సోమవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యప్తంగా మూడు లక్షల మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లను వేయబోతున్నట్లు తెలిపారు. ఈ పథకం కోసం రూ.2340 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ… రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులు కోసం ఎన్ని అడుగులైనా ముందుకు వేస్తామన్నారు. ఏపీలోని 13 జిల్లల్లో అర్హులైన అందరికి ఉచిత బోర్లు వేయించడమే.. కాకుండా భూములకు సాగునీరు అందేలా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు.