సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి మరో 17 యాప్‌లను తొలగించింది. ఈ యాప్‌లలో జోకర్ అనే మాల్‌వేర్ ఉన్నట్లు కాలిఫోర్నియాకు చెందిన ఐటీ సెక్యూరిటీ కంపెనీ జడ్ స్కేలర్ గుర్తించింది. దీంతో గూగుల్ వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఆ మాల్‌వేర్‌ను బ్రేడ్ మాల్‌వేర్ అని కూడా పిలుస్తారు.
సదరు 17 మాల్‌వేర్ యాప్స్‌కు ఇప్పటికే ప్లే స్టోర్‌లో 1.20 లక్షల వరకు డౌన్‌లోడ్స్ అయినట్లు గుర్తించారు. అందువల్ల ఆ యాప్‌లను ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకున్న వారు వెంటనే వాటిని తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ యాప్‌లు ఫోన్లలోని ఎస్ఎంఎస్‌లు, కాంటాక్ట్ లిస్ట్‌లు, డివైస్ ఇన్ఫర్మేషన్ వంటి వివరాలను సేకరించి హ్యాకర్లకు చేరవేస్తున్నాయని తెలిపారు. కనుక ఆ యాప్‌లను వెంటనే ఫోన్ల నుంచి తీసేయాలని సూచిస్తున్నారు. ఇక ఆ 17 యాప్‌ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
–All Good PDF Scanner
–Mint Leaf Message-Your Private Message
–Unique Keyboard – Fancy Fonts & Free Emoticons
–Tangram App Lock
–Direct Messenger
–Private SMS
–One Sentence Translator – Multifunctional Translator
–Style Photo Collage
–Meticulous Scanner
–Desire Translate
–Talent Photo Editor – Blur focus
–Care Message
–Part Message
–Paper Doc Scanner
–Blue Scanner
–Hummingbird PDF Converter – Photo to PDF
–All Good PDF Scanner