శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై సిఎం జగన్ కీలక ఆదేశాలు : డ్రోన్లు పెట్టాల్సిందే !

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. సమగ్ర భూ సర్వే పనుల్లో ప్రగతిని, లక్ష్యాలను సీఎం జగన్ కు ఈ సందర్బంగా వివరించారు అధికారులు. పైలట్‌ ప్రాజెక్టు కింద చేపట్టిన 51 గ్రామాల్లో సర్వే పూర్తి అయిందని.. డిసెంబర్‌ 2021 నాటికి మరో 650 గ్రామాల్లో పూర్తి అవుతుందని అధికారులు వివరించారు.

jagan
jagan

అనంతరం సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. క్రయ విక్రయాల సమగ్ర డేటా అప్‌డేట్‌ కావాలని ఆదేశించారు. అప్పుడే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయినట్టుగా భావించాలని.. న్యాయ, ల్యాండు రికార్డుల్లో నిపుణులు, అనుభవం ఉన్న వారితో ప్రత్యేక టీం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

వీరిచ్చిన సిఫార్పుల ఆధారంగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ ప్రక్రియలకు సంబంధించి ఎస్‌ఓపీలు రూపొందించాలని.. ల్యాండ్‌ రికార్డుల అప్‌డేషన్‌ కోసం ప్రతి ఏటా ఒక వారం డ్రైవ్ చేపట్టాలని పేర్కొన్నారు సిఎం జగన్. ల్యాండ్‌ సర్వేను పూర్తి చేయడానికి తగినంత సాంకేతిక పరికరాలను సమకూర్చు కోవాలన్నారు. ప్రజలు వీటికోసం ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా తగిన ఎస్‌ఓపీ రూపొందించాలని.. ల్యాండ్‌ సర్వేను పూర్తిచేయడానికి తగినంత సాంకేతిక పరికరాలను సమకూర్చు కోవాలని సీఎం ఆదేశించారు. దీనిపై తగినన్ని డ్రోన్లు పెట్టుకోవాలని సీఎం జగన్ సూచనలు చేశారు.