ఆరోగ్యశ్రీని మరో ఆరు జిల్లాలకు విస్తరించే కార్యక్రమాన్ని ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వైద్య ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాను తొలుత ఫైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి అమలు చేశామన్నారు. ఈ పథకం విజయవంతం కావడంతో కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో విస్తరించినట్లు ప్రకటించామన్నారు.
అలాగే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారోగ్యానికి పెద్ద పీట వేశామన్నారు ముఖ్యమంత్రి జగన్. వైద్యం కోసం పేదలు ఎవరూ ఇబ్బందిపడకూడదనే.. ఆరోగ్య రంగంలో సమూల మార్పులు చేస్తున్నామన్నారు. ఇకపోతే రాష్ట్రంలో మిగిలిన ఆరు జిల్లాల్లో కూడా నవంబర్ 14నాటికి విస్తరించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.