ప్రకాశం మార్కాపురం లో సీఎం జగన్ పర్యటన లో మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి కి చేదు అనుభవం ఎదురైంది. బాలినేని కి ప్రొటో కాల్ లో ప్రాధాన్యత ఇవ్వలేదు ప్రకాశం అధికారులు.
దీంతో అధికారులపై ఆగ్రహంతో ఈబిసి నేస్తం కార్యక్రమంలో పాల్గొన కుండా ఒంగోలు వెళ్ళిపోయారు బాలినేని శ్రీనివాసరెడ్డి. అంతేకాదు… బాలినేనితో పాటు ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, బాలినేని అనుచరులు వెళ్లి పోయారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు సీఎంఓ అధికారులు. సీఎం జగన్ కలవాలని బాలినేనికి సూచించారు సీఎంఓ అధికారులు. ఈ మేరకు ఫోన్ కూడా చేశారు. సీఎం జగన్ కు కలిసేందుకు తిరిగి వస్తున్నారు బాలినేని.