Breaking : నేడు వైద్యారోగ్య శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

-

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆరోగ్యశ్రీ విధానంపై సీఎం సమీక్ష చేయనున్నారు. అయితే.. గత నెలలో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌ క్యాన్సర్ విభాగాలను పటిష్టం చేయాలని ఆదేశించారు. ప్రతి మెడికల్ కాలేజీలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలన్నారు సీఎం జగన్. విజయవాడ, అనంతపురం, కాకినాడ, గుంటూరు బోధనాసుపత్రుల్లో 4 లినాక్ మిషన్లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న క్యాన్సర్ విభాగాలను పటిష్టం చేయాలన్నారు. ప్రతి మెడికల్ కాలేజీలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

విజయవాడ, అనంతపురం, కాకినాడ, గుంటూరు బోధనాసుపత్రుల్లో 4 లినాక్ మిషన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. మిగతా చోట్ల కూడా దశలవారీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలులో లైనర్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 7 మెడికల్ కాలేజీల్లో క్యాన్సర్ విభాగాలను ఆధునీకరించి బలోపేతం చేయాలని చెప్పారు. కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీల్లో కూడా అత్యాధునిక క్యాన్సర్ విభాగాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version