అలాంటి వాలంటీర్ లను తొలగించండి..సీఎం సంచలన నిర్ణయం..!

-

ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో గ్రామ వార్డు వాలంటీర్ల సేవలపై పై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మెరుగైన సేవలు అందించేందుకు వాలంటీర్లకు కౌన్సెలింగ్ ఇవ్వాలని పేర్కొన్నారు. వాలంటీర్లు అప్గ్రేడ్ అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. అయితే ప్రమాణాలను అందుకోలేకపోతే వారిని తొలగించి కొత్త వారిని నియమించాలని స్పష్టం చేశారు.

jagan
jagan

అంతేకాకుండా రాష్ట్రంలో 80 శాతం మంది సచివాలయ ఉద్యోగులు మంచి పనితీరు కనబరుస్తున్నారని…మిగిలిన 20 శాతం మంది మెరుగుపడాలని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్ ల ద్వారా పెన్షన్ పంపిణీ ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ నేపథ్యంలో కొంతమంది వాలంటీర్ లు ప్రమాణాలను అందుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ప్రమాణాలను అందుకోలేని వారిని తొలగించాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news