ఆంధ్రప్రదేశ్ లో బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రి వైయస్ జగన్ గట్టిగానే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో బలమైన కేడర్ ఉన్న నాయకులను వైసీపీలోకి ఆహ్వానించే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం విజయవంతంగా అమలు అవుతోంది.
చంద్రబాబుని ఆయన గట్టిగా టార్గెట్ చేసినట్టు సమాచారం. ఇప్పటివరకు ప్రకాశం జిల్లా నేతలను టార్గెట్ చేసిన ఆయన టిడిపి క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్న గోదావరి జిల్లాల మీద దృష్టి ఎక్కువగా సాధించినట్లు తెలుస్తోంది. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ఒకరిని పార్టీలోకి చేర్చుకుంటారని సమాచారం. ఇప్పటికే ఆయనతో మంత్రి కురసాల కన్న బాబు చర్చలు కూడా జరిపారు. త్వరలోనే కండువా కప్పే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్న కొందరు నేతలను కూడా ఆయన టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
గతంలో మంత్రిగా పనిచేసిన ఒక కీలక నేతల వైసీపీలోకి చేర్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఒక కీలక నేత పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారు ఆయన మీద కేసులు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన కూడా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఏలూరు ఎంపీ గా పనిచేసిన మాగంటి బాబు, అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న ఇద్దరు కీలక నేతలను పార్టీలోకి తీసుకునే సూచనలు ఉన్నాయని అంటున్నారు. గోదావరి జిల్లాల నుంచి త్వరలోనే 10 మంది నాయకులు పార్టీ మారే అవకాశం ఉందని సమాచారం. ఇదే జరిగితే మాత్రం పార్టీ క్షేత్ర స్థాయిలో భారీగా నష్టపోవడం ఖాయమనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది.