రేపు తూ.గో జిల్లాలో సీఎం జగన్ పర్యటన

తూర్పు గోదావరి జిల్లా : రేపు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. తూర్పు గోదావరి జిల్లా లో పర్యటించనున్నారు. ఈ పర్యటన లో భాగంగా రేపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పి.గన్నవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్. ఇక్కడ నుంచే నాడు-నేడు తొలి దశలో పూర్తి చేసిన పనులను ప్రజలకు అంకితం చేసి రెండో దశ నాడు-నేడు పనులకు శ్రీకారం చుట్టానున్నారు సిఎం జగన్.

జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేసిన అనంతరం.. విద్యార్థులతో ముచ్చటించనున్నారు ముఖ్యమంత్రి జగన్. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు వర్షసూచన ఉన్నందున ఏ ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సిఎం జగన్  తూర్పు గోదావరి జిల్లా పర్యటన నేపథ్యం లో.. ఇప్పటికే ఆ జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సిఎం జగన్ పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.