ఇవాళ సీఎం జగన్ విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగoగానే ఉదయం 9.20 కి తాడేపల్లి నుంచి బయలు దేరి… 10:40 కి అనకాపల్లి జిల్లా సబ్బవరం చేరుకోనున్నారు. ఉదయం 11 గంటల 5 నిమిషాలకు వేదిక వద్దకు చేరుకుని వైఎస్సార్ విగ్రహావిష్కరణ, పార్కు ప్రారంభోత్సవo, సహా లే అవుట్లను పరిశీలించనున్నారు.
అలాగే అర్హులైన పేదలందరికీ ఈ సందర్భంగా ఇంటి స్థలం అందించాలని నిర్ణయించారు సిఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ రోజు 1.23 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని తెలియజేశారు. కోర్టు కేసుల కారణంగా 42,639 ఇళ్ల నిర్మాణాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు.ఈ కేసుల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయాలని సూచించారు. వీలుకాని సమక్షంలో ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయాలన్నారు.అర్హులైన ప్రతిఒక్కరికీ ఇంటి స్థలాన్ని అందించాలని అధికారులకు సూచించారు. ఈ రోజున 1.79 లక్షల పి ఎం ఏ వై , వైయస్సార్ గ్రామీణ ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభిస్తున్నామని తెలియజేశారు ముఖ్యమంత్రి జగన్.