అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్, ప్రకాష్ అంబేద్కర్

-

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 13వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నేడు హైదరాబాద్ లో ఆయన 125 అడుగుల కంచు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్న విషయం తెలిసిందే. నేడు అంబేద్కర్ 125 అడుగుల కంచు విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీశ్ రెడ్డి తో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ఇతర మిత్రులందరికీ హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో అంబేద్కర్ కాంస్య విగ్రహం ఆవిష్కరణకై విగ్రహం వద్దకు చేరుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్. అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న ప్రకాష్ అంబేద్కర్ కి ఘన స్వాగతం పలికారు బౌద్ధ భిక్షువులు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరి కాసేపట్లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version