కేంద్రపై చండీఘడ్‌లో నిప్పులు చెరిగిన కేసీఆర్‌

-

దేశ చరిత్రలో నూతన అధ్యాయనం లిఖించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ పర్యటనకు వెళ్లారు. అయితే ఆయన ఈ రోజుల చండీఘడ్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిసి పర్యటించారు. రైతు ఉద్యమంలో మరణించిన రైతుల కుంటుబాలను పరామర్శించిన అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ… బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వకుండా కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు.

పొలాల్లో కరెంట్ మీటర్లు బిగించాలని ఒత్తిడి చేస్తోందని విమర్శించారు. ప్రాణం పోయినా సరే మీటర్లు పెట్టేది లేదని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినట్టు గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల అయినప్పటికి రైతుల కష్టాలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు సీఎం కేసీఆర్. రైతులకు మేలు చేయాలని ఎవరైనా సీఎం ప్రయత్నిస్తే కేంద్రం అడ్డుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన పంజాబ్ రైతులకు బీజేపీ దేశద్రోహులుగా, ఖలిస్తాన్ ఉగ్రవాదులుగా చిత్రీకరించిందన్నారు. రైతుల ఉద్యమం యూపీ, పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాలకే కాదు దేశవ్యాప్తంగా విస్తరించాలని రైతు సంఘాలకు పిలుపునిచ్చారు. గాల్వన్లోయ ఘర్షణలో అమరులైన జవాన్ల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ ఆర్థికసాయం అందజేశారు. అయితే అనంతరం తిరిగి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో ఢిల్లీకి చేరుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version