కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ కన్నా దీన స్థితి లో భారత దేశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు నిరంకుశ చట్టాలని మండి పడ్డారు. రైతులనున కేంద్రం బతకనిస్తదా ? బతకనివ్వదా ? అని ప్రశ్నించారు కేసీఆర్. దేశంలో సగం జనాభా రైతాంగత పైనే ఆధారపడి ఉందన్నారు.
వస్తున్న వానా కాలం పంట కొనేందుకు దిక్కులేదని మండిపడ్డారు కేసీఆర్. యాసంగి పంట ఇంకెక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం కొంటదని ప్రశ్నించారు. దిక్కుమాలిన ప్రభుత్వం కేంద్రం లో ఉందని విమర్శలు చేశారు కేసీఆర్. వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టే విధానాన్ని విరమించుకోవాలని హెచ్చరించారు. పంజాబ్ లో ధాన్యాన్ని కోనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణలో కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుల బాధ దేశానికి తెలిసేందుకే ధర్నాలకు పిలుపు ఇచ్చామన్నారు సీఎం కేసీఆర్.