భారత దేశంలో రైతుల తరుపున తామే పోరాడుతాం- సీఎం కేసీఆర్

-

వరిధాన్యం కొనుగోలు కోసం మహాధర్నాలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కేంద్రం, బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో వరిని కొనుగోలు చేస్తారా..? చేయరా..? అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు అంశం ఒక్క తెలంగాణలోనే లేదు.. దేశం మొత్తం ఉందని కేసీఆర్ అన్నారు. అవసమైతే భారతదేశంలోని రైతుల పక్షాన తామే పోరాడుతాం అని కేంద్రాన్ని హెచ్చిరించారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం అవసరమైతే లక్షకోట్లు ఖర్చు పెట్టైనా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. వాటిని ఎగుమతి చేసి రైతులను రక్షించాలని కోరారు. వడ్లు కొనుమని అడిగితే అడ్డగోలు, డొంక తిరుగుడు మాటలను కేంద్రం మాట్లాడుతుందని విమర్శించారు. వానాకాలం పంటను కొనుగోలు చేయడానికే దిక్కలేదు.. ఇక యాసంగి పంటను కొనుగోలుకు చేయదని కేంద్రం తీరుపై విమర్శించారు. యాసంగిలో వడ్లను వేయద్దని, వేసి ఆగం కావద్దని రైతులకు సీఎం సూచించారు.

దిక్కుమాలిన కేంద్ర ప్రభుత్వం, బుర్రలేని పనులను చేస్తుందని కేసీఆర్ విమర్శించారు. గతంలో ఎన్నోసార్లు కేంద్రం మనల్ని నిర్లక్ష్యం చేసినా.. ధర్నాలు చేయలేదు. 7 మండలాలను ఆంధ్రలో కలిపినా.. కరెంట్ లేకపోయినా.. గిరిజన యూనివర్సిటీ.. నవోదయ పాఠశాలు ఇవ్వలేదు అయినా ఏనాడు ధర్నా చేయలేదు. కానీ ప్రస్తుతం రైతుల కోసం ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కేసీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news