రేపు మేడారం జాత‌ర‌కు సీఎం కేసీఆర్

-

ఆసియాలోనే అతి పెద్ద ఆదివాసీల పండుగ.. మేడారం జాత‌ర బుధ‌వారం ప్రారంభం అయింది. తొలి రోజు స‌క్సస్ ఫుల్ గా ముగిసింది. నేడు రెండో రోజు కూడా ఈ మ‌హా జాత‌రకు ల‌క్షల సంఖ్య‌లో భ‌క్తులు హాజ‌రు అయ్యారు. కాగ శుక్ర‌వారం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ రేపు మేడారం మ‌హా జాత‌ర‌కు వెళ్ల‌నున్నారు. నేడు పుట్టిన రోజు కావ‌డంతో సీఎం కేసీఆర్ బిజీ బిజీ గా గ‌డిపారు. కాగ రేపు మేడారం వెళ్లి.. స‌మ్మ‌క్క సార‌ల‌మ్మల‌ను సీఎం కేసీఆర్ ద‌ర్శించుకోనున్నారు.

సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా.. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ తోపాటు డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి జాత‌ర ఏర్పాట్ల‌ను ప‌రిశీలిస్తున్నారు. వీరి తో పాటు రాష్ట్ర మంత్రులు కూడా అక్క‌డే ఉంటున్నారు. కాగ గ‌తంలో క‌రోనా వ్యాప్తి కార‌ణంగా సాధా సీదాగా జాత‌రను నిర్వ‌హించారు. కానీ ఈ సారి క‌రోనా వ్యాప్తి త‌గ్గ‌డంతో మేడారం మ‌హా జాత‌ర‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం అంగ రంగ వైభవంగా జ‌రుపుతుంది. జాత‌రకు ముందే దాదాపు రూ. 75 కోట్ల నిధుల‌తో మేడారంలో రాష్ట్ర ప్ర‌భుత్వం అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news