ఒక్కొక్క డి తొడ్కలు తీస్తా.. సీఎం రేవంత్ సీరియస్..!

-

సోషల్ మీడియాలో  హద్దు మీరుతున్న వారిని బట్టలూడదీసి రోడ్లమీద తిప్పిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  హెచ్చరిచారు. జర్నలిస్టు రేవతి  అరెస్టు విషయంలో బీఆర్ఎస్  వైఖరిపై సీఎం మండిపడ్డారు. ఇవాళ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. కొందరు పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీస్ లోనే పెట్టి వీడియోలు రికార్డు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు పెట్టితే వాటిపై పోలీసులు కేసు పెట్టి ఇద్దర్ని అరెస్టు చేశారు. దానికి బీఆర్ఎస్ నేతలకు దుఃఖం వస్తుంది. సోషల్ మీడియాలో వాళ్లు పెట్టిన భాష ఓ సారి వినండి. జర్నలిస్టుల ముసుగులో మమ్మల్ని మా ఇంట్లోని మహిళలపై ఇష్టారీతిలో తిట్టిస్తున్నారని బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు.

ప్రజాజీవితంలో ఉన్నాం కాబట్టి ఓపిక పడుతున్నా. ఆ భాష వింటే రక్తం మరుగుతుంది. కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే మీరసలు మనుషులేనా? మీకు భార్యా బిడ్డలు, తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, మీ చెల్లినో, మీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే మీరు వింటారా? అని ప్రశ్నించారు. నా భార్య, బిడ్డను తిటుతుంటే నాకు నొప్పి అవుతుంది. కానీ ఓ ఆడబిడ్డను అవమానిస్తుంటే మీకు నొప్పికాదా? ఏ సంస్కృతిలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా చెబుతున్నా.. ఒక్కొక్కరి తోడ్కలు తీస్తా. రాజకీయ జీవితంలో ఉన్నది మేము మమ్మల్ని విమర్శించండి. మా పనితీరుపై విశ్లేషించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news