రేపు వరంగల్ కు సీఎం కేసీఆర్..!

-

ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు వరంగల్ పర్యటన కు వెళ్లనున్నారు. అంతే కాకుండా హన్మకొండ జిల్లాల్లోనూ ఈ సందర్భంగా కేసీఆర్ పర్యటించనున్నారు. వరంగల్ నగర దక్షిణ భాగంలో ఓ ఆర్ ఆర్, ఇతర రోడ్ల అభివృద్ధి, వరంగల్ హన్మకొండ మధ్య రవాణా పై కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. అదే విధంగా నగర అంతర్గత రహదారి పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు మరియు టెక్స్ టైల్స్ పార్కు పనుల పురోగతి పై కూడా కేసీఆర్ సమీక్షించనున్నారు. ఇక హన్మకొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా కేసీఆర్ ఈ సందర్భంగా ప్రారంభించనున్నారు.

ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ నిన్న మొన్న వరుసగా ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో బిజేపి తమపై చేస్తున్న విమర్శల ను కేసీఆర్ తిప్పికొట్టారు. అంతే కాకుండా ఇక నుండి వరుస సమావేశాలు నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. దాంతో కేసీఆర్ హుజురాబాద్ లో ఓటమి తోనే వరుస సమావేశాలు నిర్వహించి మళ్లీ బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version