దుబాయ్ వేదిక గా పసికూన నమీబియా తో టీమిండియా తల పడింది. ఈ మ్యాచ్ లో ప్రపంచ నెంబర్ వన్ బౌలర్లను, స్పిన్నర్లను పసికూన నమీబియా తట్టుకుని నిలబడింది. కాస్త పోరాడి ఆలౌ అవుట్ కాకుండా టీమిండియా ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. అయితే టీమిండియా బౌలర్ల దాటికి తొక ముడుచు కంటుంది అని అనే వాళ్ల నోర్లు మూయిస్తూ నమీబియా పోరాడింది.
ఈ మ్యాచ్ లో నమీబియా 132\8 పరుగులు చేసింది. అలాగే టీమిండియా ముందు 133 పరుగుల బాధ్యతా యుతమైన టార్గెట్ ను ఉంచింది. అయితే భారత్ నుంచి స్పిన్నర్ రవీంద్ర జడేజా, రవీచంద్ర అశ్వీన్ తల మూడు వికెట్ల ను తీశారు. అలాగే పేసర్ బుమ్రా రెండు వికెట్ల ను తీశాడు. అయితే భారత బౌలర్ల ను తట్టు కుని పసి కూన ఆల్ అవుట్ కాకుండా నిలవడం నమీబియా కు గొప్ప అని క్రికెట్ విశ్లేషకులు చెబుతన్నారు. అయితే ఈ మ్యాచ్ లో నమీబియా గానీ టీమిండియా గానీ గెలిచినా.. ప్రపంచ కప్ పరంగా ఎలాంటి లాభం ఉండదు. ఈ రెండు జట్టు కూడా సెమీస్ పోరు కు దూరంగా ఉంటున్నాయి.