డ్రగ్స్‌ పై ఇక యుద్ధమే.. పోలీసులకు కేసీఆర్‌ కీలక ఆదేశాలు

-

డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తెలంగాణను చేయాలని.. గంజాయిపై యుద్ధం ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. బుదవారం ప్రగతిభవన్ లో నిర్వహించిన ఈ రెండు శాఖల ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులనుద్దేశించి మాట్లాడారు. గంజాయి వినియోగం క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నదని రిపోర్ట్స్ వస్తున్న నేపథ్యంలో గంజాయి మీద తీవ్ర యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందని సిఎం అన్నారు. పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే పూర్తిగా అప్రమత్తం కావాలని, ఉన్నతస్థాయి సమావేశంలో విస్త్రుతంగా చర్చించి గంజాయి ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

KCR-TRS
KCR-TRS

‘‘సుదీర్గ పోరాటం ఫలితంగా తెలంగాణ సాధించుకున్నాం. అభివృద్ధి దిశగా అనేక లక్ష్యాలను పూర్తి చేసుకున్నాం. వ్యవసాయంలో వచ్చిన అభివృధ్ది వల్ల కోటి 30 లక్షల ఎకరాలలో పంటలు సాగవుతున్నాయి. వ్యవసాయంలో రాష్ట్రం పంజాబ్ ను మించిపోతున్నది. మిషన్ భగీరథ ద్వారా అటవీ ప్రాంతాలలోని మారుమూల గ్రామాలకు సైతం పరిశుభ్ర జలాలందిస్తున్నాము. విద్యుత్ రంగంలో అపూర్వ విజయం సాధించాం. ఉద్యమ సమయంలో ఏవేవి ఆకాంక్షించామో వాటన్నింటిని నెరవేర్చుకుంటూ ముందడుగు వేస్తున్నాము. జాతీయంగా అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతున్నాము. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థలలో 99 శాతం సంస్థలు మనదగ్గర భారీ పెట్టుబడులను పెడుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ శాఖ ప్రదర్శించిన ప్రతిభ, నైపుణ్యం వల్లనే పెట్టుబడులు మన రాష్ట్రానికి వెల్లువెత్తుతున్నాయని’’ సిఎం పెర్కోన్నారు.

‘‘రాష్ట్రంలో తీవ్రవాదాన్ని అరికట్టగలిగాం. ఈ విజయం వెనుక పోలీస్ శాఖ త్యాగాలున్నాయి. వారు చేసిన వీరోచిత పోరాటం ఉంది. దీంతో రాష్ట్రం యొక్క గౌరవం, ప్రతిపత్తి ఎంతగానో పెరిగింది. ఒక వైపు రాష్ట్రం గొప్ప అభివృద్ధిని సాధిస్తున్న సందర్భంలో గంజాయివంటి మాదక ద్రవ్యాల లభ్యత పెరగడం శోచనీయం’’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news