తాను ఏకు మేకై ముఖ్యమంత్రిని అవుతానని భయపడే పార్టీలో నుంచి కేసీఆర్ తీసేసాడని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కిష్టంపేటలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ…
18 న్నర ఏళ్లపాటు అడుగులో అడుగేసి నడిస్తే.. నన్ను మధ్యలో వచ్చారంటున్నారని… తానేమైనా సబితా ఇంద్రారెడ్డిలాగా, ఎర్రబెల్లిలాగా మధ్యలో వచ్చానా? అని ప్రశ్నించారు.
తనకు ఏ బాధ్యత ఇచ్చినా సమర్ధవంతంగా నిర్వహించానని… ఒక్కసారి సద్దితింటేనే తల్చుకుంటారు అలాంటిది…వేల సార్లు కేసీఆర్ తో అన్నం తిన్నాను… మాట్లాడానని తెలిపారు. ఉద్యమ సమయంలో మనల్ని నమ్ముకున్నాడు.. ఇప్పుడు వదిలేసాడని మండిపడ్డారు. తాను మీకు చేసిన మేలును మరిచిపోయి తాత్కాలిక ప్రయోజనాల కోసం నన్ను ఓడించే ప్రయత్నం చేస్తారా? అని ఫైర్ అయ్యారు ఈటల. హుజుర్‌నగర్, నాగార్జున సాగర్ లాంటి చోట్ల మీరు మోసం చేయవచ్చు… కానీ హుజురాబాద్ లో మీకు సాధ్యం కాదని హెచ్చరించారు. కాపలా కుక్కలాగా ఉంటానని చెప్పి.. మనల్ని కాపాల కుక్కల్లాగా మార్చాడని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. వీళ్లకు నీతిలేదు.. జాతిలేదని.. ఓట్లు, సీట్లు, డబ్బు తప్ప వీళ్లకు మరో ముఖ్యమైన పనిలేదని మండిపడ్డారు.