ప్రస్తుతం దేశంలోని పలు ఉత్తరాది రాష్ట్రాల్లో మిడతల దండు రైతులు, ప్రజలకు తీవ్ర సమస్యగా పరిణమించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయా రాష్ట్రాల్లో మిడతలను వదిలించుకునేందుకు ప్రభుత్వాలు, రైతులు నానా కష్టాలు పడుతున్నారు. కొందరు డీజేలు పెట్టి మిడతలను తరుముతుండగా.. మరికొందరు రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. అయితే మరో రెండు, మూడు రోజులు అయితే తెలుగు రాష్ట్రాలపై కూడా మిడతలు దాడి చేయవచ్చన్న నేపథ్యంలో.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇదే విషయంపై సమీక్ష నిర్వహిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంపై మిడతలు దండెత్తవచ్చన్న విషయంపై సీఎం కేసీఆర్ మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. మిడతలు ఎప్పటి వరకు తెలంగాణకు రావచ్చు, వస్తే ఏం చేయాలి, వాటిని ఎలా తరమాలి, అందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. అనే అంశాలపై కేసీఆర్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక ఈ సమావేశ వివరాలు మరికొద్ది క్షణాల్లో తెలుస్తాయి.