ఈటెల ప్లేస్ ను అతడితో రీప్లేస్ చేస్తున్న కేసీఆర్..!

-

ఎమ్మెల్యే కోటా టిఆర్ఎస్  ఎమ్మెల్సీ అభ్యర్థులు దాదాపు ఖరారు అయ్యారు. తకెళ్ల పల్లి రవీందర్ రావు, మాజీ కలెక్టర్ వెంకట్ రామ్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, ఎంపీ బండ ప్రకాష్, పాడి కౌశిక్ రెడ్డి లకి ఎమ్మెల్సీ ఖరారు అయినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈటెల రాజేందర్ ప్లేస్ ను కేసీఆర్ మళ్లీ రీప్లేస్ చేసేందుకు కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్సీ రేసులో ఎంపి బండ ప్రకాష్ ముదిరాజ్ కు స్థానం కల్పించి ఈటెల లోటును తీర్చనున్నట్టు కనిపిస్తోంది.

ఇప్పటికే బండ ప్రకాష్ కు ప్రగతి భవన్ నుండి ఫోన్ వెళ్లినట్టు సమాచారం. ఈటెల రాజేందర్ స్థానంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్ పేరును కేసీఆర్ పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటికే రాజ్యసభ సభ్యునిగా బండ ప్రకాష్ ఉన్నారు. అంతే కాకుండా ఆయన పదవీకాలం మరో మూడున్నరేళ్లు ఉంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని ముదిరాజ్ సామాజిక వర్గం ఈటెల వల్ల దూరం అవ్వకూడదు అనే కేసీఆర్ ఈ మాస్టర్ ప్లాన్ వేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version