సూపర్ స్టార్ కృష్ణకు సీఎం కేసీఆర్ ఘన నివాళి

-

సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ పార్థివదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. కాసేపటి క్రితం నానక్రామ్ గూడా లోని కృష్ణ నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్ కృష్ణ భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. అనంతరం మహేష్ బాబును హత్తుకుని ఓదార్చారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణ గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వెంట మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ తదితర నేతలు ఉన్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంచనాలతో జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. నేడు సాయంత్రం తర్వాత అభిమానుల సందర్శనార్థం కృష్ణ భౌతిక కాయాన్ని గచ్చిబౌలి స్టేడియానికి తరలిస్తారు. రేపు ఉదయం అక్కడి నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version