చిన్నారి ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు : హోం మంత్రి

సైదాబాద్‌ లోని చిన్నారి చైత్రా ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ కేసులో నిందితుడి కోసం… పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరంగా చేస్తున్నారు. అయితే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ, సీపీ లతో హోంమంత్రి మహమూద్‌ అలీ సమావేశం నిర్వహించారు. చిన్నారి అత్యాచారం, హత్య కేసు పై సమీక్ష చేశారు హోంమంత్రి మహమూద్‌ అలీ.

mahmood-ali
mahmood-ali

ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. చిన్నారి చైత్రా ఘటన విషయం లో సీఎం కేసీఆర్‌ చాలా సీరియగ్‌గా ఉన్నారని పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు వేగవంతం చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. చట్టపరంగా నిందితుడి పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రత్యేక బృందాలతో అన్ని కోణాల్లో కేసును విచారణ చేయాలని… ఆదేశించారు. ఇక ఈ ఘటన విషయంలో సీఎం కేసీఆర్‌ బాధపడ్డారని… బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు హోంమంత్రి మహమూద్ అలీ.