రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు పథకాలను ప్రారంభించింది. నూతన పథకాలైన గృహలక్ష్మి, కులవృత్తులకు ఆర్థిక సాయం పథకాలతో పాటు రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని మంచిర్యాల జిల్లా వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గృహలక్ష్మి, బీసీ కులాల్లోని కులవృత్తుల లబ్దిదారులకు కేసీఆర్ ఆర్థిక సాయాన్ని అందించారు. రెండో విడుత గొర్రెల పంపిణీ కింద లబ్దిదారులకు కేసీఆర్ గొర్రెలను పంపిణీ చేశారు. గృహలక్ష్మి, కులవృత్తుల వారు, గొర్రెల లబ్దిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కొత్త కలెక్టరేట్ నిర్మాణం పూర్తి చేసుకొని ఈ రోజు ప్రారంభించుకున్న సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తానని ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడే హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆనాడే చెప్పాను. కానీ అది సాకారం కాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు.