యాదాద్రి-భువనగిరి : దత్తత గ్రామమైన వాసాలమర్రిలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతున్నది. వాసాలమర్రి గ్రామంలోని దళితవాడల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. దళితవాడలో కాలినడకన ఇంటింటికి వెళ్లి దళిత బంధు పథకం గురించి ఏ మేరకు అవగాహన ఉందో దళితులను అడిగి తెలుసుకున్నారు సీఎం కెసిఆర్.
దళిత బంధు పథకంతో వచ్చే పెద్ద మొత్తం డబ్బుతో ఎలాంటి ఉపాధి పొందుతారని దళితులను ప్రశ్నించిన సీఎం… పెద్ద మొత్తంలో వచ్చే డబ్బును వృధా చేసుకోవద్దని స్పష్టమైన అవగాహనతో దళిత బందు ద్వారా లబ్ధి పొందాలని సూచించారు. సుమారు గంటకు పైగా దళితవాడల్లో కాలినడకన కలియ తిరిగారు సీఎం కెసిఆర్. అంతే కాదు వాసాలమర్రి గ్రామాన్ని ఎలా అభివృద్ది చేయాలనే దానిపై.. ప్రజాలతోయి చర్చించారు. ఎన్నడూ లేని విధంగా.. వాసాలమర్రి గ్రామస్థులతో సిఎం కెసిఆర్ ముచ్చటించారు. అనంతరం సర్పంచ్ ఆంజనేయులు ఇంటికి వెళ్లి.. భోజనం చేశారు సీఎం కేసీఆర్. కాగా ఇటీవలే వాసాలమర్రిని సిఎం కెసిఆర్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.