కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రభుత్వాలకు అండగా నిలవాలని, అది అందరి బాధ్యత అని తన వంతుగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు యాభై లక్షల చొప్పున కోటి రూపాయాలను విరాళంగా ప్రకటిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి కూడా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు సినీ ఇండస్ట్రీతో సత్ససంబంధాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. సినీ ప్రముఖుల ఈవెంట్స్‌కు వెళ్తూ.. చిన్న సినిమాలను ప్రోత్సహిస్తూ ఉండే కేటీఆర్‌కు పరిశ్రమలో ఎంతో మంది మిత్రులున్నారన్న విషయం తెలిసిందే. అందులోనూ రామ్ చరణ్, మెగా ఫ్యామిలీతో మరింత దగ్గరి సంబంధం ఉంది.
పవన్ కళ్యాణ్ ఇచ్చిన విరాళానికి స్పందించిన కేటీఆర్.. ఇదో గొప్ప ముందడుగు అన్న అంటూ రిప్లై ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ కూడా తిరిగి రిప్లై ఇస్తూ.. థాంక్యూ సర్ మీ బాధ్యతను మీరు అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు.. దానికి మీకు హృదయ పూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా.. ఇలాంటి ఆపత్కర సమయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు చేస్తున్న ప్రతీ పని ఎంతో గొప్పగా ఉందని కితాబిచ్చాడు.