సొంతజిల్లాలోనే సీఎం రేవంత్‌ రెడ్డికి ఎదురుదెబ్బ !

-

సొంతజిల్లాలోనే సీఎం రేవంత్‌ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. మహబూబ్నగర్ ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. శాసనమండలి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి సుమారు 111 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలోని గెలిచారు బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి. దీంతో సంబరాలు చేసుకుంటున్నారు బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు. దీంతో సీఎం రేవంత్‌ సొంత జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థికి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది.

cm revanth manne jeevna reddy
  • మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం.
  • కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి పై 111 ఓట్ల తేడాతో విజయం.
  • మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే వెలువడిన ఫలితం.
  • పోలైన 1,437ఓట్లలో 21చెల్లని ఓట్లుగా నిర్ధారణ.
  • మొత్తం చెల్లిన ఓట్ల సంఖ్య 1,416.
  • బీఆర్ఎస్ 763, కాంగ్రెస్ 652, స్వతంత్ర అభ్యర్థి 1.
  • మార్చి 28 న జరిగిన పోలింగ్.
  • పోలింగ్ జరిగిన రెండు నెలల తర్వాత కౌంటింగ్.
  • ఏప్రిల్ 2న కౌంటింగ్ జరగాల్సి ఉన్నా పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జూన్ 2కు వాయిదా.

Read more RELATED
Recommended to you

Latest news