తెలంగాణ రైతులకు శుభవార్త.. సంక్రాంతి పండుగ కానుకగా రైతు భరోసా నిధులు!

-

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అదిరిపోయే శుభవార్త అందించింది రేవంత్ రెడ్డి సర్కార్. రైతు భరోసా నిధులపై తాజాగా కీలక ప్రకటన చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రకటించినప్పటికీ.. సోషల్ మీడియాలో కాంగ్రెస్ కార్యకర్తలు దీన్ని ప్రచారం చేసుకున్నారు. సంక్రాంతి కానుకగా రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసిందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

Good news for Telangana farmers.. Rythu Bharosa funds as Sankranti festival gift!

వచ్చే శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో… రైతు భరోసా విధివిధానాలను ఖరారు చేయబోతున్నారు. అనంతరం సంక్రాంతి కానుకగా జనవరి మాసంలో రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నారట.

ఇక అటు తెలంగాణ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రుణమాఫీ పై తాజాగా కీలక ప్రకటన చేయడం జరిగింది. ఎల్లుండి మూడు లక్షల మంది ఖాతాలలో రుణమాఫీ డబ్బులు వేస్తామని ఆయన ప్రకటించారు. పలు కారణాల వల్ల రుణమాఫీ నిలిచిన… మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి… డబ్బులు వేయబోతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడం జరిగింది.

 

Read more RELATED
Recommended to you

Latest news