కేటీఆర్‌కు సీఎం రేవంత్ పీఆర్వో స్ట్రాంగ్ కౌంటర్.. అవన్నీ వేస్ట్ అంటూ!

-

మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లో ‘ఏ మాత్రం గర్వం, అహంకారం’ తగ్గలేదని సీఎం రేవంత్ రెడ్డి పీఆర్వో అయోధ్యరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘కేటీఆర్ మారడు, ఆయన మారలేడు. ఇప్పటికీ అంతే అరొగెన్స్.. అంతే ఆటిట్యూడ్. ఆయనకు జర్నలిస్టుల మీద ఇంత అక్కసు ఎందుకు?’ అని ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా అయోధ్య రెడ్డి ప్రశ్నించారు.

ఇళ్ల స్థలాల నుంచి ప్రెస్‌మీట్లలో వెక్కిరింపుల దాక ప్రతిచోటా జర్నలిస్టులకు అవమానాలేనని, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి జర్నలిస్టులంటే అదే చులకన భావం అని మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నంత కాలం జర్నలిస్టులను కనీసం మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదని, కనీసం నాడు వైఎస్సార్ హయాంలో ఇచ్చిన ఇండ్ల స్థలాలను జర్నలిస్టులకు ఇవ్వడానికి మనసొప్పకపోగా, ఆ భూములను ఆయన స్నేహితులకు ఇవ్వాలని కేటీఆర్ చూశారని ఆరోపించారు. నేడు కాంగ్రెస్ సర్కార్ జర్నలిస్టులను సౌత్ కొరియాలోని ‘సియోల్’ తీసుకెళ్తే వ్యంగ్యంగా మాట్లాడి మరోసారి మీ తలబిరుసుతనం చూపించడం సహేతుకమేనా? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version