నేడు కొండారెడ్డిపల్లి కి సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లనున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎంగా  కావడంతో తన సొంతూరు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రహదారులు, అన్ని రకాల భవనాలు, మౌళిక వసతులు కల్పించారు. గ్రామాన్ని సర్వాంగ సుందరంగా రూపుదిద్దారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రానున్న తరుణంలో ఇప్పటికే పనులన్ని విజయవంతంగా పూర్తి చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొండారెడ్డి పల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. అందుకు సర్వం సిద్ధం చేశారు. గ్రామ అభివృద్దికి ఇప్పటికే రూ.58కోట్ల నిధులు మంజూరు చేశారు. గ్రామ స్వరూపాన్ని మార్చేవిధంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్ట్ కింద సోలార్ విద్యుత్ ఆధారిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. అయితే ఇవాళ సీఎం హోదాలో తొలిసారి సొంతూరికి వెళ్తున్నారు. ఆయన అక్కడే దసరా పండుగ వేడుకల్లో పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా కలిసి పండుగ జరుపుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version