శబరిమల దర్శనవేళలు.. ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక ప్రకటన

-

శబరిమల అయ్యప్ప స్వాముల దర్శన వేళలను పొడిగించినట్లు ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పి.ఎస్.ప్రశాంత్ తెలిపారు.ఆలయ ప్రధాన పూజారులను సంప్రదించాకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దర్శన వేళలు వేకువజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు .. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయని అన్నారు. దర్శన వేళల్లో మార్పు ద్వారా అయ్యప్ప భక్తులకు దర్శనం కోసం దాదాపు 17 గంటల సుదీర్ఘ సమయం పడుతుందని ఎస్.ప్రశాంత్ తెలిపారు.

ఈ ఏడాది శబరిమలలో అయ్యప్ప స్వామి మండల పూజా మహోత్సవాలు నవంబరు 15 నుంచి డిసెంబరు 26 వరకు జరగనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 15న మకర సంక్రాంతి వేళ శబరిమలలో మకర జ్యోతి(మకర విలక్కు) దర్శనమివ్వనుంది. కాగా, శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు ఆన్‌లైన్ బుకింగ్‌ను కేరళ ప్రభుత్వం తప్పనిసరి చేసింది.ఇకపై స్పాట్ బుకింగ్ ఉండదని స్పష్టం చేసింది. అయితే, ఆన్‌లైన్ బుకింగ్స్ చేసే వారికి 48 గంటల గ్రేస్ పీరియడ్‌ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version