విజయదశమి నాడు శమీ పూజను ఎందుకు చెయ్యాలి..?

-

విజయదశమి నాడు శమీ పూజ చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు శమీ పూజ విజయదశమి నాడు చేయాలి..? పూజ కి ఎందుకు అంత ప్రత్యేకం..? శమీ పూజ దశమి రోజు చాలా ప్రత్యేకమైనది. జమ్మి చెట్టు ని శమీ వృక్షం అంటారు.

 

అజ్ఞాతవాసంలో ఆయుధాలని పాండవులు శమీ వృక్షం పైనే దాచిపెట్టారు. తర్వాత విరాటుడు కొలువులో ఉన్న పాండవులు ఏడాది పూర్తయ్యాక మళ్లీ ఇదే వృక్షం దగ్గరికి వచ్చి శమీ వృక్షాన్ని పూజించి ఆయుధాలని తీసుకుంటారు. అపరాజితా దేవి ఆశీస్సులు వృక్ష రూపంలో వచ్చాయని భావించి కౌరవులపై విజయాన్ని సాధిస్తారు పాండవులు.

తెలంగాణలో అయితే శమీ చెట్టుకి పూజ చేసి తర్వాత పాలపిట్టను చూస్తారు. దశమి రోజు నక్షత్రాలు చూశాక శమీ వృక్షం దగ్గర అపరాజితా దేవిని పూజిస్తారు. శమీ చెట్టు చుట్టూ తిరుగుతూ ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ వుంటారు. ఆ శ్లోకాన్ని చీటిలో రాసుకుని కొమ్మలకు తగిలిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల అమ్మ వారి ఆశీస్సులు పొంది ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని భావిస్తారు.

శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ||

ఇక ఎందుకు పాలపిట్టని చూడాలి అనేది చూస్తే విజయదశమి రోజు పాలపిట్టని చూడడాన్ని నిజంగా అదృష్టంగా భావిస్తారు. నిజానికి దసరా అంటే చెడు పై మంచి గెలవడం. అయితే దసరా రోజు మంచి కలగాలంటే పాలపిట్టను చూడాలి అని అంటారు పాలపిట్ట కనిపిస్తే విజయం అందుకున్నట్లుగా భావిస్తారు అదృష్టానికి సంకేతముగా పరిగణిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version