మాదక ద్రవ్యాల కట్టడి లో భాగంగా ఏర్పాటు చేసిన వాల్ బోర్డు పై ‘మార్పు మన ప్రభుత్వ బాధ్యత, అని రాసిన రేవంత్ రెడ్డి. సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐపీసీలో తీసుకొచ్చిన మార్పులను స్వాగతిస్తున్నాం. ఈరోజు గల్లీ గల్లీలలో గంజాయి దొరికే పరిస్థితిలో వచ్చాయి. వీటిని నియంత్రించడానికి అధికారులకు సంపూర్ణ అధికారం ఇచ్చాం.
అవసరమైన సిబ్బందిని కూడా కేటాయించాం. అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. పేద, మధ్యతరగతి పిల్లలు గంజాయికి బానిసలుగా మారి నేరాలకు పాల్పడుతున్నారు. చిన్న పిల్లలపై జరుగుతున్న దాడుల వెనక గంజాయి మత్తులోనే జరుగుతున్నట్లుగా అర్థమవుతుంది. ఈ నేరాలు నియంత్రించి , తెలంగాణ సమాజంలో యువతలో పోరాట స్పూర్తి తిరిగి నింపే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలి. మాదకద్రవ్యాల కేసులను సమర్థవంతంగా నియంత్రించాలి.
మాదాక ద్రవ్యాల నియంత్రించడంలో కీలక.పాత్ర పోషించే అధికారులకు ప్రమోషన్స్ తో పాటు సైబర్ క్రైమ్ లో నైపుణ్య ప్రదర్శించి నేరగాళ్ళను పట్టుకున్న వారికి ఇతర మదకద్రవ్యాల రాకెట్లను పట్టుకున్న అలాంటి అధికారులకు నగదు బహుమతితోపాటు పదోన్నతి కూడా కల్పించడానికి అవసరమైన విధి…
సీఎం రేవంత్ అన్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీ పై సీఎం వ్యాఖ్యలు పవర్ పంచ్ కు వాడుకోవచ్చు.
మాదకద్రవ్యాలపై మెగాస్టార్ చిరంజీవి ఉచితంగా నటించి వీడియోను విడుదల చేశారు. చిరంజీవికి ధన్యవాదాలు. అలాగే మిగిలిన నటీనటులందరూ కూడా ఆయన బాటలో నడవాలని కోరారు.