మేడ్చల్ లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బాలికల హాస్టల్ లోని బాత్ రూంలో అశ్లీల వీడియోలు చిత్రీకరించిన విషయం విధితమే. ఈ ఘటన పై తక్షణమే నివేదిక సమర్పించాలని మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అమ్మాయిల బాత్ రూంలలో కెమెరాలు పెట్టి వీడియోలు తీసినట్టు సమాచారం.
అయితే కాలేజీ హాస్టల్ బాత్ రూం వీడియోల కేసులో బిహార్ కి చెందిన కిషోర్, గోవింద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు దురుద్దేశ పూర్వకంగానే అమ్మాయిల బాత్ రూమ్ లలోకి తొంగిచూసినట్టు.. విద్యార్థినులను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్టు గుర్తించారు. కళాశాల చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డి, వార్డెన్ ప్రీతిరెడ్డి సహా ఏడుగురి పై కేసు నమోదు చేసారు. విద్యార్థుల ఫిర్యాదులను పట్టించుకోలేదని వారిపై ఆరోపణలు వినిపించాయి.