కరోనా మహమ్మారి వల్ల తీవ్ర భయాందోళనలకు గురవుతున్న ప్రజలకు ఓ ఫార్మా కంపెనీ శుభవార్త చెప్పింది. స్వీడన్‌కు చెందిన లైఫ్ సైన్సెస్ సంస్థ ఎంజైమాటికా తయారు చేసిన కోల్డ్ జైమ్ అనే మౌత్ స్ప్రే ద్వారా కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే కరోనాను దాదాపుగా నాశనం చేయవచ్చని వెల్లడైంది. ఈ మేరకు ఆ కంపెనీ సోమవారం ఫైల్ చేసిన ఓ రెగ్యులేటరీలో వివరాలను వెల్లడించింది.
ఎంజైమాటికా కంపెనీకి చెందిన కోల్డ్ జైమ్ అనే మౌత్ స్ప్రేను నోరు, గొంతు భాగాల్లో స్ప్రే చేయాల్సి ఉంటుంది. దీంతో వైరస్ కేవలం 20 నిమిషాల్లోనే 98.3 శాతం వరకు నాశనం అవుతుంది. దీని వల్ల వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండదు. ఫలితంగా పరిస్థితి తీవ్రతరం కాకుండా ఉంటుంది. అలాగే శరీరంలో వైరల్ లోడ్ తగ్గుతుంది. ఇన్‌ఫెక్షన్ ఎక్కువ కాకుండా ఉంటుంది. సాధారణ స్థాయిలో కరోనా ఉంటుంది. దీంతో ఎందరి ప్రాణాలనో రక్షించేందుకు అవకాశం ఉంటుంది.
కరోనా వైరస్‌తోపాటు పలు ఇతర వైరస్‌లను కూడా ఈ మౌత్ స్ప్రే నాశనం చేస్తుందని తేలింది. ఇందులో గ్లిసరాల్, అట్లాంటిక్ కాడ్ ట్రిప్సిన్లతో కూడిన ద్రావణం ఉంటుంది. దీన్ని స్ప్రే చేసిన 20 నిమిషాలకు వైరస్ దాదాపుగా నశిస్తుంది. వైరస్ చాలా వరకు ఇనాక్టివ్ అవుతుంది. అయితే ప్రస్తుతం దీనిపై ఇంకా పరిశోధనలు చేస్తున్నామని ఆ కంపెనీ వెల్లడించింది.