తెలంగాణ : సర్కారు దవాఖానా లో కలెక్టరమ్మ డెలివరీ..!

ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ప్రభుత్వ వనరులను వాళ్ళు వినియోగిస్తూ ఇతరులు వినియోగించుకునేలా ప్రేరేపించాలి. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించడం..ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడం లాంటివి అధికారులు ప్రజా ప్రతినిధులు చేయడంవల్ల సదుపాయాలు కూడా మెరుగయ్యే అవకాశం ఉంది. దాంతో ప్రజలు కూడా ప్రభుత్వాసుపత్రులు స్కూల్ల బాట పట్టే అవకాశం ఉంది. అయితే తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ ప్రభుత్వ అధికారిని అలాంటి నిర్ణయమే తీసుకుంది. ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

పురిటి నొప్పులు రావడంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా సామాన్య మహిళలా ప్రభుత్వాసుపత్రికి వచ్చి టెస్టులు చేయించుకుంది. ఆ తర్వాత కలెక్టర్ స్నేహలతకు అక్కడే డెలివరీ చేశారు. పూర్తి ఆరోగ్యంతో కలెక్టర్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. దాంతో కలెక్టరమ్మ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని చెబుతున్నారు. కలెక్టర్ తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రభుత్వాసుపత్రుల పై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని పేర్కొంటున్నారు.